: సూళ్లూరుపేటలో డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు


నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తమకు తెలియకుండా అధికారులు విధుల చార్టును అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఉదయం ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అధికారులు తమకు సమాధానం చెప్పేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఎన్ఎంయూ, ఎన్ డబ్ల్యూఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News