: కుందూ నదికి తగ్గిన వరద
కడప జిల్లాలోని కుందూ నదిలో వరదనీటి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కర్నూలు, కడప జిల్లా సరిహద్దులోని రాజోలి వద్ద మంగళవారం సాయంత్రం 18,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా, ఇవాళ ఉదయానికి 10,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు కేసీ కాల్వ ఏఈ మస్తాన్ రావు తెలిపారు. ఎగువన కర్నూలు జిల్లాలో వర్షాలు కురిస్తే వరదనీరు చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు.