: ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసిన యాంకర్ అనసూయ
ఇప్పుడు ఇండియాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ఒక ఊపు ఊపుతోంది. హలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలైన ఈ ఛాలెంజ్ క్రమంగా బాలీవుడ్, టాలీవుడ్ లకు పాకింది. తాజాగా టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ గాయకుడు నోయల్ చేసిన ఐస్ బకెట్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు. ఓ బకెట్ నీళ్లలో ఐస్ గడ్డలు వేసుకుని తల మీద గుమ్మరించుకుని ఈ ఛాలెంజ్ ను అనసూయ విజయవంతంగా పూర్తి చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. మెదడు సంబంధిత వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 10 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఫండ్ ఇవ్వవచ్చని చెప్పిన అనసూయ, తాను కూడా ఈ మేరకు ఏఎల్ ఎస్ సంస్థకు డొనేట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అందాల యాంకర్ ప్రతి ఒక్కరికి ఐస్ బకెట్ ఛాలెంజ్ సవాల్ ను విసురుతున్నానని నవ్వుతూ చెప్పింది.