: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి: కేటీఆర్
2015 ఆగస్టు 15లోగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలా తీసుకుంటామని ఆయన అన్నారు. స్వచ్ఛ్ భారత్, స్వస్థ్ భారత్ కు సముచిత స్థానం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అదనంగా 15 వేల రూపాయలు అందజేస్తామని ఆయన చెప్పారు.