: ఈ కోర్టు వెరైటీ... అక్కడ దేవుళ్ళకు శిక్షలు వేస్తారు!
మనం చేసే తప్పులకు దేవుళ్ళు శిక్షలు వేస్తారని బాల్యంలో ఎన్నోసార్లు వినుంటాం. కానీ, ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో నిర్వహించే ఓ విలక్షణ కోర్టులో మాత్రం ఆ దేవుళ్ళకే శిక్షలు వేస్తారు. వినడానికి విచిత్రంగా వున్నా ఇది నిజం! దేవుళ్ళు మనుషులకు కలిగించే విషాదాలు, నష్టాలకు ప్రతిగా వారిపై ఈ న్యాయస్థానంలో విచారణ జరుపుతారు. జిల్లాలోని భంగారం ఆలయం వద్ద గిరిజనులు ప్రతి ఏడాది ఈ తరహా పంచాయతీ పెడతారు. తమకు వాటిల్లిన కష్టనష్టాలను ప్రజలు ఈ సందర్భంగా ఏకరువు పెడతారు. దేవుళ్ళకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపిస్తారు. వారు చెప్పింది నిజమే అని తేలితే, సదరు దేవుళ్ళకు శిక్ష తప్పదు మరి. ఈ క్రమంలో వారికి 5-10 ఏళ్ళ వరకు బందీలుగా పడి ఉండాలని తీర్పిస్తారట అక్కడి గిరిజన పెద్దలు. తమాషాగా ఉంది కదూ..!