: కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మంగళవారం కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కొల్లేరు పరిధి నుంచి ప్రైవేటు భూములకు మినహాయింపు ఇవ్వాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి త్వరలో కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.