: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం: జగన్
అసెంబ్లీలో తన ప్రసంగానికి నిన్న టీడీపీ సభ్యులు 17 సార్లు అడ్డుతగిలారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. తాను మాట్లాడిన రెండున్నర గంటల్లో... గంటా 6 నిమిషాల సేపు టీడీపీ సభ్యులు అడ్డు తగిలారని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలు మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా... అధికార పక్షానికే స్పీకర్ అవకాశం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. లైవ్ కవరేజ్ లో అధికార టీడీపీ సభ్యులను మాత్రమే చూపిస్తున్నారని... ప్రతిపక్ష వైసీపీ సభ్యులను ఏ మాత్రం చూపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ ఇకపై కూడా పక్షపాత వైఖరిని కొనసాగిస్తే మాత్రం... ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్ హెచ్చరించారు. వైసీపీ సభ్యుల సస్పెన్షన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని జగన్ స్పీకరును డిమాండ్ చేశారు.