: కర్రసాయం లేకుండా నడుస్తున్న బాలయ్య
నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ గాయం నుంచి కోలుకున్నారు. ఇటీవలే కొత్త చిత్రం షూటింగ్ సందర్భంగా బైక్ మీద నుంచి పడడంతో ఆయన కాలికి గాయమైంది. నేడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు విచ్చేశారు. సమావేశాల ఆరంభానికి ముందర లాబీల్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్... ఎలా ఉన్నారంటూ బాలకృష్ణను పలకరించారు. ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ, ప్రస్తుతం కర్రసాయం లేకుండా నడుస్తున్నానని తెలిపారు. రేపటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.