: 2015 ఆస్కార్ రేసులో బెంగాలీ చిత్రం


2015 సంవత్సరం ఆస్కార్ అవార్డుల ఉత్తమ విదేశీ చిత్రం రేసులో బెంగాలీ చిత్రం 'జాతిశ్వర్' పోటీపడుతోంది. మరో ఎనిమిది సినిమాలతో కలసి తన చిత్రం భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీ పొందేందుకు పోటీ పడుతున్నట్లు దర్శకుడు శ్రిజిత్ ముఖర్జీ ఫేస్ బుక్ లో వెల్లడించాడు. అంతేగాక చిత్ర టీమ్ కు అభినందనలు తెలిపి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాడు. బెంగాలీ సూపర్ స్టార్ ప్రసెన్ జిత్ ఛటర్జీ ప్రధాన పాత్రలో నటించగా మేకప్, మ్యూజిక్, సింగింగ్, కాస్టూమ్స్ విభాగాల్లో ఈ ఏడాది నాలుగు జాతీయ అవార్డులు కొల్లగొట్టింది.

  • Loading...

More Telugu News