: స్పీకర్ తన పద్ధతిని మార్చుకోవాలి: వైకాపా
సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ఒక పక్షానికే నాయకుడిలా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలు దేశాయి తిప్పారెడ్డి, పీడిక రాజన్న దొరలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుందని... అయినా, తమకు మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పీకర్ కోడెల తన ధోరణి మార్చుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే ప్రాణం కాబట్టి... మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.