: షారుక్ ఖాన్ కు అదనపు భద్రత ఇవ్వాలని ముంబయి పోలీసుల నిర్ణయం


పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ రవి పూజారి నటుడు షారుక్ ఖాన్ ను సంప్రదించడానికి నిన్న మధ్యాహ్నం తీవ్రంగా ప్రయత్నించాడన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆయనకు పోలీసు భద్రతను పెంచాలని ముంబయి పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ముందు జాగ్రత్తలో భాగంగా షారుక్ కు ఇకనుంచి అదనపు భద్రతను ఇవ్వనున్నారు. ఇటీవల 'చెన్నై ఎక్స్ ప్రెస్' నిర్మాత కరీం మొరానీ లక్ష్యంగా ఆయన ఇంటి బయట ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అటు పూజారీ నుంచి కూడా నిర్మాతకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ నుంచి ఆపద ఉన్న వారికి రక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News