: ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ... షెడ్యూల్ ఇదే...


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిన్న బిజీ బిజీగా గడిపిన ఆయన ఈరోజు కూడా పలువురు కీలక నేతలతో సమావేశమవుతున్నారు. అంతేకాకుండా విదేశీ రాయబారులతో కూడా భేటీ కానున్నారు. ఆయన షెడ్యూల్ వివరాలు ఇవే... * ఉదయం 10 గంటలకు కేంద్ర పర్యాటక మంత్రి యశోనాయక్ తో భేటీ * 11.30 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తో సమావేశం * మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ * 12.30 గంటలకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం * ఒంటి గంటకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ * 2 గంటలకు కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం * 3 గంటలకు ఏపీ భవన్ లో ప్రెస్ మీట్ * సాయంత్రం 4 గంటలకు కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశం * 4.45 గంటలకు ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ తో భేటీ * 5.30 గంటలకు జపాన్ రాయబారి తకేషియాగితో సమావేశం

  • Loading...

More Telugu News