: ప్రారంభమయిన శాసనసభ... నడుస్తున్న ప్రశ్నోత్తరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే తాగునీటి సమస్యపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొనడంతో స్పీకర్ వాయిదా తీర్మానంపై తరువాత చర్చిద్దామని సర్ది చెప్పారు. దీంతో శాంతించిన వైఎస్సార్సీపీ నేతలు తమ స్థానాల్లో కూర్చున్నారు. దీంతో శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమయింది.