: దీనికేమంటారు?... అధ్యాపకుడిపై చేయిచేసుకున్న విద్యార్థి


విద్యార్థులను దండిస్తే గురువులు కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు అంటూ విరుచుకుపడే కుహనా వాదులంతా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. టీచర్ కొడితే అదే పెద్ద తప్పైతే... గురువునే విద్యార్థి కొడితే దానిని ఎలా తీసుకోవాలి? ఏమని ప్రశ్నించాలి? ఎవర్ని బాధ్యులను చేయాలి? హైదరాబాద్ బోరబండ పరిధిలోని కార్మికనగర్ సమీపంలోని బ్రహ్మశంకర్‌నగర్‌కు చెందిన నర్సింహ కుమారుడు ఎస్‌ఆర్‌నగర్‌లోని లెజెండ్ సీఎ కళాశాలలో చదువుతున్నాడు. కాలేజీకి ఆలస్యంగా వచ్చిన అతడిని అధ్యాపకుడు తరచూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని నిలదీశాడు. దానికి విద్యార్థి దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థి లెక్చరర్ యాడంపై చేయి చేసుకున్నాడు. చేయి చేసుకోవడంతో ఆయన విద్యార్థిని నెట్టివేశారు. దీంతో కిందపడిన విద్యార్థికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషయం అతను తన తండ్రి నర్సింహకు చెప్పడంతో అతను కళాశాలకు వచ్చి తగదా పెట్టుకుని లెక్చరర్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News