: నిరసనకారులపై సుప్రీం సీరియస్... షరీఫ్ కు స్వల్ప ఊరట


పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె దిగాలంటూ ఇమ్రాన్ ఖాన్, తాహిరుల్ ఖాద్రీల ఆధ్వర్యంలో ఆ దేశంలో నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్న సంగతి తెలిసిందే. వేలాది మంది మద్దతుదారులతో వీరు ఇస్లామాబాద్ లోని రెడ్ జోన్ లో ఆందోళన చేపట్టారు. వీరి నిరసనలతో రోడ్డు మార్గాలు దిగ్బంధం కావడంతో... కోర్టుకు జడ్జిలు, లాయర్లు సైతం హాజరుకావడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో, నిరసనకారులపై పాక్ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రెడ్ జోన్ నుంచి 24 గంటల్లో వెళ్లిపోవాలని నిరసనకారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీం తీర్పుతో ప్రధాని ఫరీఫ్ కు స్వల్ప ఊరట లభించినట్టైంది.

  • Loading...

More Telugu News