: వైఎస్సార్సీపీ ప్రాంతీయ పార్టీ... మాది జాతీయ పార్టీ: యనమల
వైఎస్సార్సీపీ ప్రాంతీయ పార్టీ అని, టీడీపీ జాతీయ పార్టీ అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ చేయడం వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ పార్టీ అయినందున ఒకే మేనిఫెస్టో ఇచ్చిందని, తమది జాతీయ పార్టీగా ఎదిగినందున ప్రాంతాలను, ప్రాధాన్యతలను బట్టి రెండు మేనిఫెస్టోలు విడుదల చేశామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.