: విద్యారంగంలో అజీమ్ ప్రేమ్ జీ రూ. 900 కోట్ల పెట్టుబడులు!


విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ విద్యారంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో 10 శాతం వాటా కొనుగోలు చేసేందుకు దాదాపుగా రూ. 900 కోట్లను వెచ్చించనున్నారు. ప్రేమ్ జీ ఇన్వెస్ట్ పేరిట వివిధ సంస్థల్లో పెట్టబడులు పెట్టేందుకు అజిమ్ ప్రేమ్ జీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న విభాగం ద్వారా మణిపాల్ గ్లోబల్ లో పెట్టుబడులు పెట్టే దిశగా జరుగుతున్న చర్చలు దాదాపు ముగింపునకు వచ్చాయి. విద్యారంగంపై ప్రేమ్ జీకి ఉన్న ఆసక్తి ఏమిటో ఈ డీల్ వెల్లడించనుంది. రంజన్ పాయ్ నేతృత్వంలోని మణిపాల్ సర్వీసెస్ కు దేశ విదేశాల్లో క్యాంపస్ లున్నాయి.

  • Loading...

More Telugu News