: మాజీ నక్సల్స్ గ్యాంగ్ వార్


నల్లగొండ జిల్లాలో మాజీ నక్సలైట్ల మధ్య గ్యాంగ్‌వార్‌ మరోసారి కలకలం రేపుతోంది. గతంలో కొసపురి రాములును నయీమ్‌ గ్యాంగ్ కాల్చి చంపడంతో రేగిన గ్యాంగ్ వార్ మరోసారి జడలు విప్పింది. వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో మాజీ మావోయిస్టు శంకర్‌పై కొసపురి రాములు ప్రధాన అనుచరుడు ప్రదీప్ రెడ్డి కాల్పులు జరిపారు. కాల్పులకు తోడు బైక్ పై నుంచి పడడంతో శంకర్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి అతనిని తరలించి చికిత్స అందిస్తున్నారు. శంకర్‌ బెక్‌పై వెళ్తుండగా ప్రదీప్‌రెడ్డి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ప్రదీప్ నేరుగా భువనగిరి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయారు.

  • Loading...

More Telugu News