: చిరుతపులిని హతమార్చిన పల్లెటూరి మహిళ


ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలోని కోటీ బోద్నా గ్రామానికి చెందిన కమలాదేవి (54) ఇప్పుడు వార్తల్లోకెక్కింది. మనిషిని అవలీలగా చంపగలిగే చిరుతపులినే హతమార్చింది ఈ గ్రామీణ మహిళ. కుమారుడు ఢిల్లీలో ఉంటుండగా, గ్రామంలో ఒక్కతే ఉంటోంది. ఆదివారం నాడు పొలంలోకి వెళ్ళిన కమలాదేవిపై సమీప అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత దాడి చేసింది. ఆమె చేతిలో కొడవలి, ఓ చిన్న గొడ్డలి వంటి ఆయుధాలే ఉన్నాయి. వాటితోనే తలపడింది. చిరుత రెచ్చిపోయినా కమలాదేవి వెనుకంజ వేయలేదు. చివరికి తీవ్రగాయాలపాలైన ఆ క్రూరమృగం ప్రాణాలు విడిచింది. అనంతరం, ఈ సాహసవనిత రక్తమోడుతున్న శరీరంతో గ్రామం చేరుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. పాపం, వందకు పైగా కుట్లుపడ్డాయట.

  • Loading...

More Telugu News