: ఫలించిన లాలూ-నితీశ్ మంత్రం... బీహార్ లో ఆరు స్థానాల్లో గెలుపు


బీజేపీ ఓటమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచారం చేసిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ల దోస్తీ మంత్రం ఉప ఎన్నికల్లో మంచి ఫలితాన్నే చూపింది. మొత్తం పది స్థానాల్లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమి ఆరు శాసనసభ స్థానాలను గెలుచుకుంది. మిగతా నాలుగు స్థానాల్లో కమలం వికసించింది. ఈ క్రమంలో కమలం హవాను లాలూ, నితీశ్ లు కొంత మేరకు తగ్గించారనే చెప్పాలి. అటు కర్ణాటకలో మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్-2, బీజేపీ-1 స్థానంలో గెలుపొందాయి. పంజాబ్ లో రెండు స్థానాలను కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ చెరొకటి పంచుకున్నాయి. మధ్యప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ-2, కాంగ్రెస్ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఫలితాలపై ఆర్జేడీ అధినేత లాలూ స్పందిస్తూ, "మా (ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్) కూటమిని గెలిపించినందుకు బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా. లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు చేసిన తప్పును సరిచేసుకోవచ్చు" అంటూ ముంబయిలో తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి ట్విట్ చేశారు. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News