: 40 బీఎస్ఎఫ్ శిబిరాలపై కాల్పులకు తెగబడిన పాక్


పాక్ ముష్కర సైన్యం మరోసారి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడుస్తూ, భారత బలగాలపై కాల్పులకు దిగింది. సరిహద్దుల్లోని రామ్ ఘర్, కానాచాక్, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్ల పరిధిలో ఉన్న 40 బీఎస్ఎఫ్ శిబిరాలపై కాల్పులు జరుపుతోంది. హెవీ మోర్టార్ షెల్లింగ్స్, హెవీ మెషీన్ గన్స్ ను పాక్ బలగాలు వినియోగిస్తున్నాయని భారత సైనిక అధికారులు తెలిపారు. నిన్న రాత్రి 10 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని... ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులకు గాయాలయినట్టు సమాచారం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు 70 సార్లకు పైగా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

  • Loading...

More Telugu News