: ముంబైలో 2022 నాటికి గ్యాస్ పైప్ లైన్


2022 నాటికి ముంబైలో కనీసం 70 శాతం మందికి పైప్ లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ముంబైలో సహజవాయువు పంపిణీ సంస్థ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ముంబైలో ప్రతి ఇంటికీ గ్యాస్ పైప్ లైన్ ద్వారా పంపిణీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, 22 లక్షల పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షెన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తం కనెక్షన్లలో ముంబై వాటా 7.30 లక్షలని ఆయన తెలిపారు. సీఎన్జీ చౌకగా లభించే సురక్షిత ఇంధనమని ఆయన తెలిపారు. రానున్న 15 ఏళ్లలో దేశ వ్యాప్తంగా 30 వేల కిలోమీటర్ల మేర సీఎన్జీ పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News