: మిర్యాలగూడలో 2 కోట్లకు టోపీ


ప్రజలు ఆర్ధిక నేరాల బారిన పడుతున్నా అప్రమత్తం కావడంలేదు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ సంపాదన అంటే చాలు ఎగబడి చేరిపోయి ఝలక్ లు తింటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్థిక నేరం వెలుగుచూసింది. మనీ మార్కెటింగ్ స్కీమ్ పేరుతో జనాలకు ఓ సంస్థ 2 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. వస్తువులు ఇస్తామంటూ 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News