: 16 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారా?


ఢిల్లీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో 16 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలంటూ రవాణాశాఖకు లేఖ రాశారు. ప్రైవేటు, కమర్షియల్ వాహనాలకు చెందిన ఈ లైసెన్సుల్లో తరచూ ప్రమాదాలకు కారణం డ్రైవర్లేనని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో 85 లక్షల వాహనాలుండగా, 25 లక్షల కేసులు విచారణలో ఉన్నాయి. వీటి సంఖ్య ఈ ఏడాది అంతానికి 50 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News