: విదేశీ వేతనాల మోజులో ఇండిగోను వీడిన 40 మంది సీనియర్ పైలట్లు


తక్కువ ధర టికెట్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థను నిపుణులైన సిబ్బంది వీడుతున్నారు. గతేడాది ఈ సంస్థను 40 మంది సీనియర్ పైలట్లు వీడారు. గల్ఫ్ దేశాలకు చెందిన సంస్థలు ఇచ్చే ఆకర్షణీయ జీతాలు ఒక కారణమైతే, వర్క్ కల్చర్ కూడా ఈ పైలట్లను ఆకర్షిస్తోంది. దీంతో సీనియర్ పైలట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ను వీడినట్టు ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, డీజీసీఏ లెక్కల ప్రకారం ఇండిగో మార్కెట్ షేర్ విలువ జూన్ లో 31.6 ఉండగా, జూలైలో 30.7 శాతానికి పడిపోవడం విశేషం.

  • Loading...

More Telugu News