: నార్త్ కాలిఫోర్నియాను కుదిపేసిన భూకంపం
కాలిఫోర్నియా రాష్ట్రాన్ని భూకంపం కుదిపేసింది. యూఎన్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం... నార్త్ కాలిఫోర్నియా రాష్ట్రంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైంది. శాన్ ఫ్రాన్సిస్కో, డెవిస్ తదితర ప్రాంతాల ప్రజలు భూమి కంపించడం గుర్తించామని సామాజిక అనుసంధాన నెట్ వర్క్ లలో పేర్కొన్నారు. కాగా, భూకంప ప్రభావంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.