: బదిలీ చేస్తే రాజీనామా చేస్తానన్న గవర్నర్ బదిలీ...!
తనను బదిలీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ ను ఎన్డీయే గవర్నమెంట్ మిజోరంకు బదిలీ చేసింది. యూపీఏ నియమిత గవర్నర్లు రాజీనామా చేయాలని ఎన్డీయే ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాజీనామా చేయమని బీష్మించుకున్న గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఆయన రాజీనామా చేస్తారో లేదో చూడాల్సిందే. కాగా, 82 ఏళ్ల శంకరనారాయణన్ పదవీ కాలం 2017తో ముగియనుంది.