: మహారాష్ట్ర గవర్నర్ బదిలీపై కాంగ్రెస్ ఆగ్రహం
యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లకు ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాలు తప్పడంలేదు. ఇటీవలే కొందరు గవర్నర్లను ఇంటికి సాగనంపిన మోడీ సర్కారు తాజాగా, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ ను మిజోరం బదిలీ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్యతం చేసింది. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మండిపడ్డారు. గవర్నర్లను రాజకీయ కోణంలో చూడరాదని, వారిపట్ల అమర్యాదకర రీతిలో నడుచుకోరాదని 2004లో సుప్రీం కోర్టు పేర్కొందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పును సైతం బీజేపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని ఆరోపించారు.