: మన్మోహన్ సింగ్ ప్రధాని బాధ్యతల నుంచి పారిపోయారంటున్న మాజీ 'కాగ్'
మన్మోహన్ సింగ్ తన పదవీకాలంలో ప్రధాని బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ అంటున్నారు. తన పుస్తకం 'నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్' లో రాయ్ ఈ వ్యాఖ్య చేశారు. సమర్థంగా వ్యవహరించాల్సిన చోట పిరికితనం ప్రదర్శించారని అన్నారు. కుహనా రాజకీయాల్లో తానూ భాగమయ్యానని ఓసారి మన్మోహనే స్వయంగా పేర్కొన్నారని, ఆ విషయాన్ని తన పుస్తకం మరింత వివరణాత్మకంగా చెబుతుందని రాయ్ తెలిపారు. కాగా, సభలో పార్లమెంటు పద్దుల కమిటీ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తనపై విపరీతంగా ఒత్తిడి తెచ్చిందని ఈ మాజీ కాగ్ ఆరోపించారు. యూపీఏ హయాంలో చోటు చేసుకున్న అనేక కుంభకోణాలపై కాంగ్రెస్ స్పందనలను తన పుస్తకం చక్కగా వివరిస్తుందని తెలిపారు.