: హైదరాబాదులో ‘రన్ రాజా రన్’
హైదరాబాదులో ఆదివారం ఉదయం ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో మారథాన్ రన్ ఉత్సాహంగా మొదలైంది. నెక్లెస్ రోడ్ లోని పీపుల్ ప్లాజా వద్ద 5కె మారథాన్ ను నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికాసేపట్లో గచ్చిబౌలి వద్ద 5కె మారథాన్ ప్రారంభమవుతోంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద 5కె మారథాన్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.