: అక్కడి అభివృద్ధిని కళ్ళారా చూసేందుకు రోడ్డు మార్గాన ప్రయాణించిన కేసీఆర్
తొలి విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సింగపూర్ నుంచి మలేసియా వెళ్ళేందుకు రోడ్డు మార్గం ఎంచుకోవడం విశేషం. శనివారం ఉదయం 11 గంటలకు బయల్దేరిన ఆయన సాయంత్రం 4 గంటలకు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. సింగపూర్ నుంచి మలేసియా వరకు జరిగిన అభివృద్ధిని కళ్ళారా చూసేందుకు కేసీఆర్ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. అంతకుముందు ఆయన మూడు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించారు.