: జగన్ కు జైలుకు, అసెంబ్లీకి తేడా తెలియడంలేదు: పత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు జైలుకు, అసెంబ్లీకి తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. జగన్.. సైకో ఫ్యాక్షనిస్టు నుంచి సైకో ఎమ్మెల్యేగా ఎదిగాడని పేర్కొన్నారు. స్పీకర్ పై జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పత్తిపాటి ఈ సందర్భంగా చెప్పారు. రెండు నెలల్లోనే స్పీకర్ పై తీర్మానం పెట్టడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. జగన్ తో ఐదేళ్ళ ప్రయాణం ఎలా చేయాలా? అని సొంత పార్టీలోని వాళ్ళే ఆందోళనలో పడ్డారని మంత్రి వ్యాఖ్యానించారు.