: ఇంజినీరింగ్ కళాశాలల పిటిషన్ పై హైకోర్టు తీర్పు వాయిదా
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం, కళాశాలల తరపున వాదన ముగిసింది. తుది తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 26, 27, 28న జరిగే ఎంసెట్ వెబ్ సైట్ కౌన్సెలింగ్ లో తమకు అవకాశం ఇవ్వాలని, కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ కళాశాలలు విజ్ఞప్తి చేశాయి. సరైన సౌకర్యాలు లేని కారణంగా 174 కళాశాలల గుర్తింపును తెలంగాణ ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. ఈ క్రమంలోనే కళాశాలలు కోర్టుకు వెళ్లాయి.