: బెజవాడ బ్లూఫిలిం రాకెట్లో ప్రముఖుల పుత్రరత్నాలు!
విజయవాడలో నీలిచిత్రాలు రూపొందించే ముఠాను అరెస్టు చేశారు. ప్రేమ పేరిట యువతులను ట్రాప్ చేసి, అనంతరం వారికి మత్తుమందు ఇచ్చి నీలిచిత్రాలు తీస్తున్నట్టు గుర్తించారు. ఓ అపార్ట్ మెంట్ వేదికగా ఈ భాగోతం నడుస్తున్నట్టు గుర్తించిన పోలీసులు, దాడి చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ముఠాలో పలువురు ప్రముఖుల తనయులు ఉన్నట్టు సమాచారం. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.