: ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారానికి వాయిదాపడింది. అంతకుముందు, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తాను ప్రమాణస్వీకారం చేయకముందు కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వివిధ ఘటనల్లో మరణించారని, అయితే, జరిగిన ప్రతిదాన్ని తమపై మోపేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారనీ అన్నారు. తప్పులు చేసిన వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన పదేళ్ల పాలనలో శాంతి భద్రతలను కాపాడానన్న సీఎం, ఈ విషయంలో రాజీపడొద్దని పోలీసులకు చెప్పానని తెలిపారు. ఈ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.