: రాంచీలో జేఎంఎం, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ


జార్ఖండ్ ముక్తి మోర్చా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య రాంచీలో చోటుచేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ రాంచి ఎయిర్ పోర్టుకు వచ్చిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా జేఎంఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అంటూ నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈ సమయంలోనే జేఎంఎం, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. మూడు రోజుల కిందట జార్ఖండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ పాల్గొన్నారు. ఆ సభలో సొరెన్ మాట్లాడుతుండగా కొంతమంది మోడీ అభిమానులు నినాదాలు చేశారు. అందుకు ప్రతీకారంగా ఆ రాష్ట్రం వచ్చిన ప్రతి కేంద్ర మంత్రికి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సొరెన్ మాట్లాడుతూ, జరిగిన ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థపై అత్యాచారం జరిగినట్లేనని అన్నారు. ప్రధాని మోడీ పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News