: జగన్ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించడానికి అసెంబ్లీ ఇడుపులపాయ కాదు: అచ్చెన్నాయుడు
జగన్ అసెంబ్లీలో రౌడీలా ప్రవరిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఒకసారి తాను ఎలా ప్రవరిస్తున్నారో టీవీలో చూసుకుని తెలుసుకోవాలని ఆయన జగన్ కు సూచించారు. జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడేందుకు శాసనసభ ఇడుపులపాయ, పులివెందుల కాదని అచ్చెన్నాయుడు అన్నారు. నియమావళి ప్రకారమే శాసనసభ జరుగుతుందని... జగన్ ఎలా కావాలంటే అలా జరగదని ఆయన స్పష్టం చేశారు.