: స్పీకర్ కోడెల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు: జగన్


శాంతిభద్రతలపై చర్చ మొదలైన తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలపై జగన్ మండిపడ్డారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి దారుణంగా అబద్ధాలు మాట్లాడుతుంటే ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయకుండా... స్పీకర్ పక్షపాత ధోరణితో ఆయన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న కోడెల... సభాపతిపై ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. తాను సభలో అందరినీ సమానంగా చూస్తున్నానన్నారు. జగన్ కు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను అవకాశం ఇచ్చానని... తనపై పక్షపాత ఆరోపణలు చేయడం తగదని అన్నారు.

  • Loading...

More Telugu News