: జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ కమోర్త


జలాంతర్గాములను దీటుగా ఎదుర్కోగల విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కమోర్తను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు. విశాఖ నేవీయార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యుద్ధ నౌక సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ నౌక నుంచి షార్ట్ రేంజ్ మిస్సైళ్లను, టార్పెడోలను ప్రయోగించవచ్చు. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి జైట్లీ మాట్లాడుతూ, రక్షణ పరమైన అన్నింటినీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవడమనేది భారత ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. ఐఎన్ఎస్ కమోర్త దీర్ఘ కాలం పాటు దేశానికి అత్యున్నతమైన సేవలు అందిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News