: నిరుద్యోగ భృతి కల్పిస్తామని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం


ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతిపై తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బడ్జెట్ పాస్ అయిన తర్వాత నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ (వైకాపా) అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని యనమల వెల్లడించారు. అంతేకాకుండా, నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త రూపం తీసుకొస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News