: నేడు వామపక్షాల తెలంగాణ రాష్ట్ర సదస్సు... టీఆర్ఎస్ హామీలే అజెండా
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సు జరగనుంది. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, దళితులు, గిరిజనులకు భూపంపిణీ వెంటనే అమలు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేయనున్నారు. ఈ వివరాలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో వెల్లడించారు.