: ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు


టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హైదరాబాదులోని రవీంద్రభారతి వద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ప్రకాశం పంతులు జయంతిని ఏపీ ప్రభుత్వం 'రాష్ట్ర అధికారిక పండుగ'గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 'ఆంధ్ర కేసరి'గా పేరుగాంచిన టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న ఒంగోలు సమీపంలోని వినోదరాయుడు పాలెంలో జన్మించారు.

  • Loading...

More Telugu News