: ఎయిమ్స్ లో నకిలీ మందులు విక్రయిస్తున్నారు: విజిలెన్స్ మాజీ అధికారి చతుర్వేది


విఖ్యాత అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో నకిలీ మందులు విక్రయిస్తున్నారని సంస్థ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజయ్ చతుర్వేది ఆరోపించారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్న ఆస్పత్రిలో, వాటిని అడ్డుకునేందుకు యత్నించిన తనను నిబంధనలకు విరుద్ధంగా బయటకు పంపారని చతుర్వేది వాపోయారు. ఆస్పత్రిలో చక్రం తిప్పుతున్న వైద్యులకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతల అండ కూడా ఉందని వెల్లడించారు. నకిలీ మందుల విక్రయానికి సంబంధించి ఆస్పత్రిలోని ఓ మెడికల్ షాపును తనిఖీ చేసిన కారణంగానే తనపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయన్నారు. ఆస్పత్రిలో నకిలీ మందుల విక్రయం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నిర్విఘ్నంగా కొనసాగుతున్న తీరుపై నివేదిక సమర్పించేందుకు సిద్ధమైన క్రమంలో తనను సాగనంపేందుకు సదరు కాంగ్రెస్ నేత బీజేపీ సర్కారును శరణువేడారన్నారు. సదరు నేతకు ఇంతకుముందు కూడా బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో సహకరించారని ఆయన వెల్లడించారు. దేశంలోని అత్యుత్తమ వైద్య సంస్థగా పేరుగాంచిన ఎయిమ్స్ లో వైద్యాధికారుల కుక్కపిల్లలకు కూడా చికిత్స చేస్తున్నారని చతుర్వేది ఆరోపించారు.

  • Loading...

More Telugu News