: పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చర్యలు: నిర్మలాసీతారామన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసే పెట్రోకెమికల్ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. విశాఖపట్టణం-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ తొందర్లోనే పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఏపీకి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని నిర్మాలా సీతారామన్ తెలిపారు.