: భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అంటోన్న బ్రిటన్
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సిద్ధమవుతోంది. బ్రిటన్ ఉప్ ప్రధాని నిక్ క్లేగ్ సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో... ఆయన ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బిజినెస్ సమ్మిట్ లో నిక్ క్లేగ్ పాల్గొంటున్నారు. బ్రిటన్ ఉప ప్రధాని భారత్ పర్యటించే సమయంలో బ్రిటన్, భారత శాస్త్రవేత్తల మధ్య కూడా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.