: నేత ఇల్లు గుల్ల చేసి హతమార్చారు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. శికోహబాద్ సమీపంలోని మాథోగంజ్ రైల్వే క్రాసింగ్ పరిధిలో నివసిస్తున్న సమాజ్ వాదీ పార్టీ నేత ఇంటిపై బందిపోటు దొంగలు దాడి చేశారు. ఎస్పీ నేత రామ్ రతన్ యాదవ్ (60) ఇంటిపై దాడి చేసిన 20 మంది దొంగలు అతని ఇల్లు గుల్ల చేసి... అంతటితో ఆగక అతనిని హతమార్చారు. అతని భార్యను చావబాదారు. తీవ్ర గాయాల పాలైన ఆమె పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆగ్రాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దోపిడీ దొంగలు యాదవ్ ఇంటి నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాహా చేసినట్టు పోలీసులు వెల్లడించారు.