: భారత క్రికెటర్లకు దేశభక్తి లోపించింది: కీర్తీఆజాద్
భారత క్రికెటర్లకు దేశభక్తి లోపించిందని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తెలిపారు. బీహార్ లోని దర్పాంగాలో ఆయన మాట్లాడుతూ, టీమిండియా ఆటగాళ్లలో నిబద్ధత లోపించడమే దారుణమైన ఓటమికి కారణమని అన్నారు. డబ్బుకోసం ఐపీఎల్ లో ఆడడంపై ఉన్న శ్రద్ధ, దేశం తరుపున ఆడేటప్పుడు కూడా ఉంటే బాగుంటుందని ఆయన మండిపడ్డారు. ఇంగ్లండ్ టెస్టుల్లో దారుణ పరాజయంతో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన భారత్ జట్టులో బీసీసీఐ చేసిన మార్పులు అద్భుతాలు ఏవీ చేయవని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ క్రికెటర్ రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించడం శాశ్వత పరిష్కారం కాదని ఆయన తెలిపారు. కాకుంటే రవిశాస్త్రి వన్డే సిరీస్ లో జట్టు లోపాల్ని సరిచేయగలడని ఆజాద్ తెలిపారు. టీమిండియాలో ఆటగాళ్లంతా పూర్తి నిబద్ధతతో ఆడితేనే విజయాలు సాధించగలరని ఆయన స్పష్టం చేశారు.