: ఆ ముగ్గురు కేంద్ర మాజీ మంత్రులపై అరెస్టు వారెంట్లు జారీ
యూపీఏ ప్రభుత్వంలో పని చేసిన కేంద్ర మాజీ మంత్రులు ముగ్గురికి అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన కేంద్ర మాజీ మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి.చిదంబరంలపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.