: అతను బంతిని విసిరేస్తున్నాడా?... 21 రోజుల్లో బౌలింగ్ యాక్షన్ పై తీర్పు


జింబాబ్వే బౌలర్ ప్రొస్పేర్ ఉత్సేయ బౌలింగ్ యాక్షన్ పై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఉత్సేయ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఐసీసీకి సౌతాఫ్రికా ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన నివేదికను ఐసీసీ జింబాబ్వే జట్టుకి అందించింది. ఉత్సేయ బౌలింగ్ చేసినప్పడు బంతి చేతినుంచి విడుదలవ్వడం వివాదాస్పదంగా ఉందని ఫిర్యాదులో సౌతాఫ్రికా పేర్కొంది. అతని బౌలింగ్ యాక్షన్ ను 21 రోజుల్లో పరిశీలించిన నిపుణులు ఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికను అనుసరించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News