: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో, రాష్ట్రంలో నరమేధం సృష్టించారు: బొండా ఉమ


వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో... రాష్ట్రంలో నరమేధం సృష్టించారని బొండా ఉమ ఆరోపించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో 189 మంది తెలుగుదేశం కార్యకర్తలను దారుణంగా చంపించారని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని బొండా ఉమ విరుచుకుపడ్డారు. హత్యలపై వైఎస్ జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వాడికే... ఊరంతా పచ్చగా కనపడుతుందనే నానుడి చందంగా... హత్యలు చేసే వైసీపీ నాయకులకు అందరూ నేరస్తుల్లాగానే కనపడతారని ఆయన వ్యాఖ్యానించారు. పరిటాల రవిని సాక్షాత్తూ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులు ఘోరంగా హత్య చేయించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News